జగన్ ఫోటో పై సోషల్ మీడియాలో పేలుతున్న పంచ్ లు…

173

THE BULLET NEWS -ముఖ్యమంత్రి కావడమే ధ్యేయంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర 200 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఓ స్వామీజీ పలకరిస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోకి జగన్ మద్దతుదారులు తమదైన శైలిలో కామెంటరీ పోస్ట్ చేశారు.

 

‘‘ఏందయ్యా జగన్ బాబు, నీకు ఈ కష్టాలు.. ఎలా ఉండాల్సిన వాడివి ఎలా ఉన్నావు? సొమ్ము ఒకరిది సోకు మరొకరిదిలా ఉంది నిన్ను చూస్తుంటే.

దోచుకుని దాచుకుని తింటుంది ఒకరు ప్రజల కష్టాలు మాత్రం నీకా !!!

మంచి రోజులు వస్తాయి జగన్ బాబు. సాక్షాత్తు ఒక స్వామీజీ మన జగన్ అన్నతో అన్న మాటలు ఇవి…’’ అంటూ జగన్ ఫాలోయర్స్ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

 

దీనిపై నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. ‘‘నిజమే ప్రతి శుక్రవారం జడ్జి దర్శనం చేసుకుని రావాలంటే కష్టం గానే ఉంది. ఏం చేస్తాం.. బిడ్డ అల్లాడిపోతున్నాడు.’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నిజం గెలుస్తుందిలే స్వామీజీ’,.. ‘జగన్ సీఎం అవుతాడు’ అంటూ ఇంకొంతమంది కామెంట్ చేశారు

SHARE