బాలాయ‌ప‌ల్లి తహశీల్దార్ కార్యాలయంలో రాహువు.. కేతువు

165

The bullet news (Balaya palli)- రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ బాలాయపల్లి ఎమ్మార్వో రాంబాబు లీలలు ఒక్కొక్కటే బైటకొస్తున్నాయి. తహశీల్దార్ తన కార్యాలయంలోనే ప్రైవేట్ సిబ్బందితో పనులు చక్కబెట్టుకుంటుంటాడని ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఇతనికి కావాల్సిన అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఇందులో ఒకరు అదే మండలంలో రేషన్ డీలర్ కాగా, మరొకరు ఎరువుల వ్యాపారి. వీరిద్దరూ నిత్యం ఎమ్మార్వోతో కలసి ఆఫీస్ కి వస్తుంటారు. ఆయన రూమ్ లోనే మకాం పెడతారు. ఎమ్మార్వోని కలవాలంటే ముందు వీరి దగ్గర పర్మిషన్ కావాలి, చివరకు ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో వీరివల్ల ఇబ్బందులు పడ్డారని సమాచారం. అయ్యవారు ఇప్పుడు పనిలో ఉన్నారు, తర్వాత రావాలంటూ అందరికీ వీరు హుకుంలు జారీ చేస్తుంటారు. ఆఫీస్ పనిగంటల్లో, పనిగంటలు ముగిసిన తర్వాత కూడా ఈ ప్రైవేట్ బ్యాచ్ తోనే కలసి సెటిల్మెంట్లు చేస్తుంటాడు సదరు రాంబాబు. డిప్యూటీ తహశీల్దార్ గా ఉన్నప్పటి నుంచి రైతులతో నేరుగా లావాదేవీలు మాట్లాడుకుంటాడు, ఈ లావాదేవీలకు ప్రైవేట్ బ్యాచ్ సహకారం అందిస్తుంటుంది. అంతా వీరి కనుసన్నల్లోనే పనులు జరిగిపోతుంటాయి. రాంబాబుకి ఎమ్మార్వోగా పదోన్నతి వచ్చిన తర్వాత వీరి ఆగడాలు మరింత పెరిగాయి. ఆఫీస్ లో తమకి ఎదురేలేదన్నట్టుగా చెలరేగిపోతున్నారు. నిన్నటి ఏసీబీ రైడ్ లో కూడా ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హల్ చల్ బైటపడింది. రేషన్ డీలర్ చేతుల మీదుగానే ఎమ్మార్వోకి లంచం సొమ్ము ముట్టిందట. లంచగొండి అధికారుల పని పట్టడంతోపాటు, ఇలాంటి ప్రైవేట్ సైన్యాలు తిష్టవేయకుండా చూసినప్పుడే ప్రభుత్వ కార్యాలయాలకు మకిలి అంటకుండా ఉంటుందని స్థానికులంటున్నారు. మొద‌టి నుంచి పోకూరి రాంబాబుపై ఆది నుంచి తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి… ఉన్నత స్థాయి నేతలు తమ కన్నుసన్నల్లో ఉన్నందున గ్రామస్థాయిలో దళారులను ఏర్పాటు చేసుకుని రికార్డుల తారుమారుకు శ్రీకారం చుట్టినట్లు విమర్శలున్నాయి..

SHARE