నెల్లూరు లో రైల్ రోకో ఉద్రిక్తం.. వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్

68

THE BULLET NEWS (NELLORE)-రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో రైల్ రోకో నిర్వహించేందుకు ప్రయత్నించిన వైసిపి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసారు.. ఆత్మకూరు బస్టాండు నుంచి ర్యాలీగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ , ప్రతాప్ రెడ్డి , గోవర్ధన్ రెడ్డి లతో పాటు వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు… మరోసారు వెళ్లేందుకు చేసిన యత్నాన్నికూడా పోలీసులు నిలువరించడంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలువాగ్వివాదానికి దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు చివరికి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్ర ప్రజల అందరి హక్కు అని, సాధించే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి బ్రమించి వ్యవహరిస్తున్నారని , పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.. తాము అధికారంలోకి రాగానే చంద్రబాబుకు తమ ఖర్చులతో చికిత్స చేయిస్తామని ఎద్దేవా చేసారు..

SHARE