వైస్సార్సీపీ మరోసారి దొరికిపోయింది…

101

THE BULLET NEWS (AMARAVATHI):- రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి దొరికిపోయిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడు… డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో అటు ఎన్డీఏ, ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయకుండా వైసీపీ నిర్ణయం తీసుకోవడంపై స్పందించిన ఆయన…  వైఎస్ జగన్‌కు ఒక రాజకీయ విధానం అంటూ లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులకు నాడు వైఎస్ జగన్ ఎందుకు ఓటువేశారని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు… నేడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారని నిలదీశారు. వైసీపీ తీవ్ర గందరగోళంలో ఉందని విమర్శించిన అచ్చెన్నాయుడు… బీజేపీ మోసం వల్లే నేడు ఓటింగ్‌కు వెళ్లడంలేదన్న వైసీపీ నేతలు… నాడు అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు చెప్పాలని డిమాండ్ చేశారు.

SHARE