THE BULLET NEWS (CHENNAI)-రజినీకాంత్ రాజకీయ ప్రకటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. రజినీకాంత్ చదువూసంధ్యా లేని వ్యక్తి అని, అతను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం చేస్తాడు ఆయన అని విమర్శించారు. నటులు రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో కొత్తేమీ కాదని, ఇది పాత కథేనని చెప్పారు. తమిళ రాజకీయాల నుంచి నటులను వెలేసినప్పుడే తమిళనాడు ప్రతిష్ఠ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అతని పార్టీ ఏంటో ప్రకటించలేదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చెప్పారు. అతనో నిరక్షరాస్యుడని, రజినీకాంత్ విషయంలో మీడియా హడావుడి తప్ప మరేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజలు తెలివైన వారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చెప్పారు.

SHARE