రైతు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పొగాకు రైతులను ఆదుకోవాలి.. ఎంపీ విపిఆర్

96

The Bullet News – ( NELLORE)

గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కొట్టిమిట్టాడుతున్న పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు విపిఆర్ డిమాండ్ చేశారు.. తోబాకో బోర్డు అధికారులు గిరిరాజ్ కుమార్ మరియు రామారావును కలిసి జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న మరియు సమస్యలపై చర్చించారు.. ఈ సందర్బముగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.. జిల్లాలో కలిగిరి, డిసిపల్లి లో పొగాకు వేలం కేంద్రాలున్నాయని, వీటి పరిధిలో ఉన్న సుమారు 3200 పొగాకు బారన్ లు ద్వారా రైతులకు లాభాలు రాకపోవటము భాదాకరమన్నారు.. జిల్లాలో సుమారు 8 వేల హెక్టార్లు పొగాకు సాగు చేస్తున్నారని, వర్షాలు లేకపోవడం, ప్రతి ఏటా ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పొగాకు రైతులు నష్టాలు చవిచూస్తున్నారన్నారు.. మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు,మర్రిపాడు,ఉదయగిరి,కలిగిరి,దుత్తలూరు వరికుంటపాడు,వింజమూరు , పొదలకూరు , తదితర మండలాలో పొగాకు సాగు చేస్తూ రైతులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని అధికారులకు వివరించారు.. దళారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని విపిఆర్ డిమాండ్ చేశారు.. రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయ్యాలన్నారు..

 

SHARE