మెట్ట ప్రాంత ఆశాజ్యోతి మాదాల జానకి రామ్: మాజీ మంత్రి ఆనం..

112

The bullet news ( Duttaluru)- మెట్ట ప్రాంత వాసుల ఆశాజ్యోతి మాదాల జానకి రామ్ అని మాజి మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ అన్నారు.. ఇవాళ నర్రవాడలో మాజీ మంత్రి, స్వర్గీయ మాదాల జానకిరామ్ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు.. ఆయన మాట్లాడుతూ మాదాల జానకిరామ్ అజాతా శత్రువు మాదాల అన్నారు..ఆయన లేని లోటు మెట్ట ప్రాంత వాసులకు తీరని లోటన్నారు.. ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పోరాట యోధుడని, రాష్ట్ర మంత్రిగా జిల్లా ప్రజలకు అనేక సేవలు అందించిన చిరస్మరణీయుడు మాదాల జానకిరామ్ అని ఆయన సేవలను కొనియాడారు.. ఆంద్రసేన పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన మడమతిప్పని నేతగా ఆయన సేవలు అనిర్వచనీయమైనవన్నారు…

SHARE