రైతులు, యువత భవిష్యత్  కోసం రామాయపట్నం పోర్టు అవసరం -సోమశిల మాజీ చైర్మన్ మధుబాబు 

143

The bullet news ( Kavali) _ రామాయపట్నం పోర్టు సాధనే లక్ష్యంగా ప్రజా సంఘాలు, విద్యార్ది నాయకులు నడుంబిగించారు. కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జేఎసీ నాయకులు సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సోమశిల మాజీ చైర్మన్ మధుబాబు
మాట్లాడుతూ రామాయపట్నం పోర్ట్ వస్తే కావలి చుట్టుపక్కల ప్రాంత వాసులకు మంచి జరుగుతుందన్నారు.. రామాయపట్నం పోర్టు సాధనకు అందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు .. కావలి రైతులకు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉపాధి కల్పన లేక నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారన్నారు.  కావలి పట్నం కనక పట్నం అవ్వాలంటే రామాయపట్నం పోర్టు అవసరం అన్నారు.. ప్రాంతాలకు అతీతంగా పోర్టు కోసం ఉద్యమించాలన్నారు.. దుగరాజపట్నం ఇవ్వలేమని చెబుతున్నప్పుడు  రామాయపట్నం పోర్టు ప్రపోజల్ ఎందుకు పంపడం
లేదని ఆయన ప్రశ్నించారు.. యువత భవిష్యత్ కోసం పోర్టు అవసరమన్నారు.. రాజకీయాలు పక్కన పెట్టి పోర్టు సాధన కోసం క్రుషి చేయాలని ఆయన కోరారు..

SHARE