పేద ముస్లింలకు రంజాన్ ఉపవాస సరుకులు పంపిణీ

57

The Bullet News ( Nellore ) _రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అల్ హింద్ సఫా బైతుల్ మాల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బారకాసు మసీదులోని సంస్థ కార్యాలయంలో పేద ముస్లిం కుటుంబాలకు ఉపవాసం సరుకులను ఆదివారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మెన్ మౌలానా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిఒక్కరూ ఉపవాస దీక్షను పాటించేందుకు దాతల సహకారంతో నిత్యావసరాలు పంపిణీ చేస్తోన్నామని వెల్లడించారు. సరుకుల్లో భాగంగా పాతిక కేజీల బియ్యం, పప్పులు, నూనె, నెయ్యి వంటి ఇతర వంట సామాగ్రిని అర్హులైన 70 మంది పేద ముస్లింలకు అందించడం ప్రతీ ఏటా బాధ్యతగా నిర్వర్తిస్తోన్నామని మౌలానా తెలిపారు. దాతలు ముందుకొచ్చి సంస్థకు సహకరించడం ద్వారా మరికొంతమందికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

SHARE