THE BULLET NEWS (INDORE)- ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పాట్లవాద్ గ్రామంలో తన స్నేహితుడిని కలవడానికి బాధితురాలు వచ్చింది. అయితే అప్పటికి అతను రాకపోవడంతో బస్టాప్‌లోనే కూర్చుంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి.. ఇక్కడ సేఫ్ కాదని.. సమీపంలో ఉన్న గుడిలోకి వెళ్లి కూర్చోమని సలహా ఇచ్చాడు. అది నమ్మిన ఆమె గుడిలోపలికి వెళ్లింది. ఆ అజ్ఞాతవ్యక్తి తన ఇద్దరు స్నేహితులకు సైగ చేయడంతో వాళ్లు కూడా ఆలయంలోకి వెళ్లారు. అక్కడే ఆమెపై అత్యాచారం జరిపి.. దుండగులు పారిపోయారు.

ఈ ఘటన నుంచి తేరుకున్న ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రేప్ చేసిన ముగ్గురిలో ఒకరికి బైక్ ఉంది. ఆ బైక్‌పై సంజు బాబా అనే స్టిక్కర్ ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. సంజయ్ పటేల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతన్ని ప్రశ్నించడంతో.. అసలు విషయం బయటపెట్టాడు. చేసిన నేరాన్ని ఒప్పుకుని.. మిగిలిన ఇద్దరి పేర్లు చెప్పాడు. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SHARE