పట్టపగలు కామాంధుల దుశ్శాసన పర్వం…

128

THE BULLET NEWS (BIHAR)-జెహానాబాద్‌లో పట్టపగలు దుశ్శాసన పర్వం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆమె బట్టలూడదీసి  అసభ్యంగా ప్రవర్తించారు. ఇంత దారుణం జరుగుతున్నా ఆమెకు ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వారి నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఆ బాలిక పెనుగులాడిన దృశ్యాలు చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నయ్యర్‌ హస్నైన్‌ ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. యువకులు వినియోగించిన బైక్‌ ద్వారా సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ వీడియోను చిత్రీకరించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలోని ఇద్దరు యువకులను పట్టుకునేందుకు జెహానాబాద్‌లో ప్రతి ఇంటిలో గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.

SHARE