ఖాకీల దౌర్జన్యం

165

THE BULLET NEWS ( RAPUR)-ప్రజల ధన ,మాన ,ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ రోజు రోజుకు దిగజారిపోతుంది.అమాయకులైన ఫిర్యాదు దారులనే పోలిసులు చావబాదుతున్నారు.తమ వాళ్ళు ను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయాడానికి వెళ్ళిన ఓ వ్యక్తి ఎస్ఐ లక్ష్మన్ రావు తన సబ్బందితో లాఠీ విరిగేలా చితకబాదారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా రాపురు మండలం పంగిలి గ్రామానికి చెందిన చిన్నయ్య అనే వ్యక్తిని పోలీసులు చితక బాదారు… పంగిలికి చెందిన చిన్నయ్య అనే వ్యక్తీ తన చెల్లెలిని కడప జిల్లాలో ఇచ్చి వివాహం చేయడం జరిగింది.. ఐతే పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కట్నం కొంత ఇవ్వలేక పోవడంతో తన బావమరిది చిట్టిబాబు ఇబ్బందులకు గురిచేస్తుండటం జరిగుతుంది. ఐతే రెండు రోజులక్రితం చిట్టిబాబు చిన్నయ్యకి సంభందించిన కుర్రాడిని కిడ్నాప్ చేసాడంటు కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో పోలీసులు తమ ప్రతాపం చూపారు.. లాటిలతో కాళ్ళ పై ఇష్టానుసారంగా కొట్టారు.. న్యాయం చేయాలని పోలీసుల వద్దకు వెళితే తనను ఇష్టానుసారంగా కొట్టారని చిన్నయ్య అంటున్నాడు…

SHARE