రాపూరు ఎస్.ఐ లక్ష్మణ్ రావు దాష్టికం…

2461

THE BULLET NEWS (RAPUR)-ఓ వైపు ఓవర్ యాక్షన్ చేసే ఖాకీల పై ఎస్పీ జూలు విదిలిస్తుంటే… మరో వైపు అదే ఖాకీ డ్రెస్ చూసుకుని చెలరేగిపోతున్నారు మరికొందరు పోలీసులు.. హీరోలు గా ఫీల్ అయిపోతూ సామాన్య జనాన్ని చావబాదుతున్నారు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఉన్నతాధికారులు చెబుతున్నా.. మాకు అవేమి పట్టవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయి సిబ్బంది.. రాపూరు లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా ఉంది.. స్టేషన్ కి టీ తీసుకురాలేదంటూ రాజస్థాన్ కి చెందిన ప్రజాపథ్ రంలాల్ అనే వ్యక్తిని రాపూరు ఎస్ ఐ లక్ష్మణ్ రావు చితకబాదారు.. స్పృహకోల్పోయిన బాదితున్ని రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు..మెరుగైన చికిత్స కోసం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.. గతంలో కూడా పలువురి పై చేయి చేసుకున్నట్లు ఎస్ ఐ లక్ష్మణ్ రావు పలువురిపై ఆరోపణలు ఉన్నాయి.. ఇలాంటి ఖాకీల వల్లే పోలీసు డిపార్ట్మెంట్ పరువు పోతుందని, ఎస్ ఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు..

SHARE