THE BULLET NEWS (RAPUR)-నెల్లూరు జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి నిరసన సెగలు కొనసాగుతున్నాయి.. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్నీ స్థానికులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు..రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీ లో నిర్వహిస్తున్న గ్రామాసభ ను రావిగుంటపల్లి గ్రామస్తులు బహిష్కరించారు.. అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.. రావిగుంటపల్లి వద్ద నిర్మిస్తున్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు..పరిశ్రమ రద్దు చేసిన తర్వాతే తమ గ్రామంలో సభ నిర్వహించాలని మండిపడ్డారు.. సమస్యలు పరిష్కరించలేని సభలు ఎందుకని వారు అధికారులను నిలదీశారు…

SHARE