రేషన్ బియ్యం పట్టివేత ….

209

ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు కి అక్రమంగా తరలిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.వేటపాలెం లో దాదాపు 300 బస్తాలు పిడిఎఎస్ రైస్ ను లోడుచేసిన అక్రమార్కులు వాటికి చిలకకురుపేట టూ చెన్నై అన్నట్లుగా రవాణా బిల్లులను తయారు చేసి ఆపై నెల్లూరుకి మళ్లించారు.. అక్రమ బియ్యం రవాణా పై పక్కాగా సమాచారాన్ని తీసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వేటపాలెం నుంచి ప్రజాపంపిణీ బియ్యాన్ని తోడుచేసుకుని వస్తుండగా కోవూరు వద్ద విజిలెన్స్ అధికారులు కాపుకాచి ఆపారు. దాంతో అందులో ఉన్న డ్రైవర్ పరారు కాగా లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు..ప్రజాపంపిణీ బియ్యం అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్& ఎన్ఫోర్స్ మెంట్ డిఎస్పి వెంకటనాథ్ రెడ్డి తెలిపారు.