నెల్లూరు సింహపురి హాస్పటల్లో జీవన్ దాన్ పై సమీక్షా సమావేశం

98

The Bullet News ( Nellore ) _ యాంకర్ : నెల్లూరులోని సింహపురి హాస్పటల్ లో జీవన్ దాన్ సౌత్ జోన్ సమీక్షా సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమానికి జీవన్ దాన్ చైర్మన్, ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
వైస్ ఛాన్సలర్ డా.సి.వి. రావు ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు.. 2015 లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవన్ దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అవయవదానం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు ఈ సమావేశంలో రూపొందిచనున్నట్లు ఆయన తెలిపారు. సౌత్ జోన్ పరిధిలో అవయవ దానం చేసిన వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ కుటుంబ సభ్యులను అవయవ దానానికి ఒప్పించడం చాలా కష్టతరమవుతోందన్నారు. సింహపురి హాస్పిటల్స్ చైర్మన్ కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ అవయవ దాతలకు ప్రోత్సాహకాలు ఇచ్చేటట్లు ప్రభుత్వం చొరవ తీసుకుంటే దాతల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సూచించారు. ఈ కార్యక్రమంలో కిడ్నీ వ్యాధుల నిపుణులు డా.మాధవ్ దేశాయ్ తదితరులు మాట్లాడారు. అనంతరం బ్రెయిన్ డెడ్ అయి సింహపురి హాస్పిటల్స్ లో అవయవ దానం చేసిన బెజవాడ వెంకటేశ్వర్లు రెడ్డి మరియు బాలిరెడ్డి సరసమ్మ కుటుంబ సభ్యులకు జీవన్ దాన్ చైర్మన్, సి.ఇ.ఓ. చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ సి.ఇ.ఓ. డా.జి. కృష్ణ మూర్తి, డా.సురేంద్ర కుమార్, డా.లక్ష్మి రమేష్, డా.వరప్రసాద రావు, డా.వెంకటేశ్వర ప్రసన్న, డా.రాజమోహన్ రెడ్డి, డా.నరేష్, నారాయణ హాస్పిటల్స్ సి.ఇ.ఓ. డా.విజయ మోహన్ రెడ్డి, సౌత్ జోన్ లో ఉన్న సింహపురి హాస్పిటల్స్, కిమ్స్, నారాయణ, అపోలో, అరవింద్ కిడ్నీ, స్విమ్స్-తిరుపతి ల నుండి వచ్చిన
వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

SHARE