The bullet news ( Nellore)_ తనను అప్రతిష్ట పాలు చేయడానికే రాజకీయ కక్షతో పోలీసులు తనపై బెట్టింగ్ కేసు పెట్టారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి అన్నారు. క్రికెట్ బుకీలకు మద్దతుగా పోలీసులకు తాను ఫోన్ చేసివుంటే వాటి వివరాలు బయట పెట్టాలని ఆయన కోరారు. తాను ఎవరికి ఫోన్ చేశానో ఆ అధికారుల పేర్లు ఎందుకు ఎస్పీ బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొందరు బుకీలు మంత్రులకు సన్మానాలు చేశారని, అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టారని, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని శ్రీధర్ రెడ్డి అడిగారు.తనపై ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి గంటలో రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.కృష్ణ సింగ్ అనే బుకీతో తాను విజయవాడలోని ఓ హోటల్, కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు చెబుతున్నారని, అలా ఉంటే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీ కి చిత్తశుద్ధి ఉంటే ఏఎస్పీ గన్ మెన్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. అన్ని ఆధారాలు ఎస్పీ కి పోస్ట్ ద్వారా అందజేస్తామని ఆయన తెలిపారు.

SHARE