ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి

109

The bullet news(crime)-సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సీనియర్లు ర్యాగింగ్ చేసారని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. బెంగుళూరు దయానంద సాగర్ కళాశాలలో  మేఘన సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. తండ్రి చంద్రశేఖర్ బ్యాంకు ఉద్యోగి. తల్లి లత ఒక సహకార సంఘంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మేఘన కాలేజీకి వెళుతున్నానని చెప్పింది. అనంతరం తల్లిదండ్రులు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లి పోయారు. వాళ్లిద్దరూ వెళ్లిపోయిన అనంతరం మేఘన ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు సీనియర్ల ర్యాగింగే కారణమంటూ ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. అయితే ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఖండిస్తున్నారు. తమ కాలేజీలో ర్యాగింగ్‌కు అవకాశం లేదని అంటున్నారు. మేఘన తల్లిదండ్రులు మాత్రం ర్యాగింగ్ కారణంగానే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

SHARE