హోదా కోసం కొనసాగుతున్న రిలే దీక్షలు…

29

The bullet news ( Venkata Chalam)_ హోదా పై వైసీపీ నేతలు, విద్యార్థి విభాగ నాయకులు పట్టు బిగిస్తున్నారు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లో ఎంపీలు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో రిలే దీక్షలు చేపట్టాలంటూ వైసిపి అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి..
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలంలో వైసీపీ నాయకులు చేస్తున్న దీక్షలు 8వ రోజుకు చేరాయి..జడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షల్లో ఇవాళ వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. పెంచలనాయుడు మాట్లాడారు.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా ఎంపీలు ఢిల్లీలో పోరాడితే టిడిపి ఎంపిలో డ్రామాలాడరని మండిపడ్డారు.. హోదాతోనే నిరుద్యోగ సమస్య తిరుతుందన్నారు.. 5 కోట్ల ప్రజల అభీష్టం మేరకు జగన్ మొదటి నుంచి హోదా కోసం పోయేడుతున్నారన్నారు.. కార్యక్రమంలో ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడపాల ఏడుకొండలు, ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి నరసయ్య, వెంకటరమణయ్య, ఎస్సి సెల్ మండల కన్వీనర్ కృష్ణయ్య, విద్యార్థి నాయకులు నరేష్ నాయుడు, వెంకటేష్, అనిష్, సాయి,తదితరులు పాల్గొన్నారు.

SHARE