నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం… ఇద్దరి మృతి

104

The bullet news (Nellore)_ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం చింతలగుంట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. ఎద్దులను తరలిస్తున్న టాటా ఏస్‌ వాహనం టైరు పంక్చర్‌ కావడంతో చింతలగుంట వద్ద రహదారి పక్కన నిలిచి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఆ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అందులో నిద్రిస్తున్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి గ్రామానికి చెందిన నవీన్‌(19), నరసింహులు(58) ప్రాణాలు కోల్పోయారు. వీరు నెల్లూరు జిల్లాలో ఎద్దులను కొనుగోలు చేసి స్వస్థలానికి తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న రెండు ఎద్దులు కూడా చనిపోయాయి.

SHARE