దెబ్బతిన్న పులిలా విజృంభించిన టీమిండియా…

111

THE BULLET NEWS-మొహాలీ స్టేడియం చిన్నబోయింది. గ్రౌండ్ మొత్తం హోరెత్తింది. దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది టీమిండియా. టాస్ ఓడినా.. వీర ప్రతాపం చూపించారు బ్యాట్స్ మెన్. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే క్రికెట్ ఆడుతున్నాడా.. కొడుతున్నాడా అన్నట్లు సాగింది బ్యాటింగ్ విశ్వరూపం. 50 ఓవర్లలో భారత్ 392 పరుగుల స్కోర్ చేసింది.

రోహిత్ శర్మ.. ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఫస్ట్ వన్డేలో అత్యంత తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయ్యి.. కసితో రగిలిపోతున్న కొత్త కెప్టెన్.. రెండో వన్డేలో విశ్వరూపం చూపించాడు. జస్ట్ 153 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఇందులో 12 సిక్స్ లు ఉన్నాయి. 13 ఫోర్లు ఉన్నాయి. ఫోర్లు, సిక్స్ ద్వారానే 124 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ రేటు 135శాతం. అంటే ఏ విధంగా బౌలర్లను ఆడుకున్నాడో అర్థం అవుతుంది. రోహిత్ ను ఔట్ చేయటానికి శ్రీలంక ఏడుగురు బౌలర్లను మార్చినా ఫలితం లేదు. బాల్ ఎలా వచ్చినా బాదుడే బాదుడు. రోహిత్ శర్మకు వన్డేల్లో ఇది మూడో డబుల్ సెంచరీ.

రోహిత్ శర్మతోపాటు కొత్త ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (88) కూడా రాణించాడు. మొదట్లో ఆచితూచి ఆడుతూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డ్ పరిగెత్తించాడు. శిఖర్ ధావన్ 68 పరుగులు, ధోనీ 7 పరుగులు, చివరిలో వచ్చిన పాండ్యా 8 పరుగులు చేశారు.

SHARE