ఎమ్మెల్యే అనిల్ మీద వస్తున్న రూమర్స్ లో నిజమెంత..?

883

THE BULLET NEWS “HOT TOPIC” (NELLORE)-

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో యంగ్ ఎమ్మెల్యే గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్ ఏంటి..? నిజంగా ఆయన అంత పనీ చేశారా..? లేక ఆయన వ్యతిరేకులు పనిగట్టుకుని మరీ చేస్తున్న ప్రచారమా.. ? ఇంతకీ ఏది నిజం..? దీని పై అనిల్ ఏమంటున్నారు.. ? అనుచరులు అంతరంగం ఏంటి..? ఇవాళ్టి హాట్ టాపిక్ లో..

అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈయన ఫైర్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్…కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటంలో అనిల్ రూటే స‌ప‌రేటు.. దాంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కూడా. 2009లో కాంగ్రెస్ త‌ర‌పున బ‌రిలో దిగిన అనిల్ స‌మీప ప్ర‌త్య‌ర్ది పిఆర్పీ అభ్య‌ర్ది ముంగ‌మూరు చేతిలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు.. 2014లో వైసిపి తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు… ఇదంతా గతం.. ప్రస్తుతం.. సోషల్ మీడియా వేదికగా అనిల్ మీద ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.. దానికి తోడు ఒకటి, రెండు ఛానెల్స్ సైతం అనిల్ పై కథనాలు ప్రసారం చేసాయి…దీంతో దానికి కాస్త హైప్ క్రీయేట్ అయింది.. ఇక అసలు మేటర్ కి వస్తే… పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వైపు అనిల్ కుమార్ యాదవ్ మొగ్గు చూపుతున్నారని, అందులో భాగంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అనిల్ క‌లిశార‌ని రూమ‌ర్ సారాంశం..

అనిల్ కుమార్ యాద‌వ్ కు చ‌దువుకునే రోజుల నుంచే వ‌ప‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అభిమానం.. పవన్ నెల్లూరు విఆర్ కాలేజీలో విద్యాభ్యాసం చెయ్యటం, సినీ హీరో కావటంతో ఆయన పై అనిల్ అభిమానం పెంచుకున్నారు.. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పేశారు.. పవన్ తో పాటు చిరంజీవి అంటే కూడా త‌న‌కు అభిమాన‌మంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు.. కానీ ప్రస్తుతం జనసేన వైపు అనిల్ చూస్తున్నారని.. ఇదే విషయం పై పవన్నీ సైతం కలిశారని సోషల్ మీడియా లో ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది.. కానీ ఈ విషయాన్ని అనిల్ అనుచరులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.. ఒక్క మాట‌లో చెప్పాలంటే దీన్ని వాళ్లు లైట్ తీసుకుంటున్నారు.. వైసీపీ అధినేత జగన్ కి అత్యంత ఆప్తుల్లో ఎమ్మెల్యే అనిల్ ఒకరని, అలాంటి అనిల్ జనసేన వైపు చూస్తున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అనీల్ కుమార్ యాద‌వ్ క‌ల‌వ‌లేద‌ని ఆయ‌న అనుచ‌రులు స్ట్రాంగ్ గా చెబుతున్నారు..

పనిలేని కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ అనిల్ కుమార్ యాద‌వ్ పై దుష్ప‌చారాలు చేస్తున్నార‌ని వారు మండిప‌డుతున్నారు.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిగా చూడ‌ట‌మే అనీల్ గోల్ అని వాళ్లు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సిటీ నుంచి అనిల్ మరోసారి విజ‌య‌ఢంకా మోగించ‌డం ఖాయ‌మ‌ని ఆయన అనుచరులు ధీమాగా ఉన్నారు. మ‌రో ప‌క్క ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఇవేమీ ప‌ట్టించుకోకుండా పార్టీ బలోపేతం మీదే దృష్టి పెడుతున్నారు. ప్రజాదీవెన పేరుతో నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు.. ఆక్రమణల తొలగింపు పేరుతో అధికారులు పేద ప్ర‌జ‌లు ఇళ్లను కూలుస్తుంటే వారికి బాసటగా నిలబడుతున్నారు.. సిటీలో మ‌రింత పట్టు పెంచుకునే దిశ‌గా అడుగులేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అనీల్ కుమార్ యాద‌వ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిశార‌నేది.. జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నేది రూమ‌ర్ మాత్ర‌మేన‌ని దాంట్లో వాస్త‌వం ఏమాత్రం లేద‌ని దీన్ని బ‌ట్టి స్ప‌ష్టంగా అర్ద‌మ‌వుతోంది..

SHARE