ఓట్ల తొలగింపు వెనుక ఉన్న ఆంతర్యమేంటి..?

93

The Bullet News ( Nellore)_ అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైరయ్యారు.. రూరల్ నియోజకవర్గంలో సుమారు
80వేల ఓట్ల తొలగింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్ .డి .ఓ ని కలసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పిచకుంటే జిల్లా అధికారయంత్రాన్ని కోర్టుకి ఈడుస్తానంటూ ఆయన హెచ్చరించారు.. తన నియోజకవర్గ పరిధిలో ఇంత భారీస్థాయిలో ఓట్లు తొలగించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇదే విషయం పై ఎన్నికల కమిషను కు ఫిర్యాదు చేస్తాన్నారు..

SHARE