బురిడీ బాబాను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు

84

The bullet news ( Nellore )_  నెల్లూరు జిల్లాలో సంచలనం కల్గించిన బురిడీ బాబా కేసులో పోలీసులు పురోగతి సాధించారు.. గతంలో కీలక నిందితురాలుగా ఉన్న వాసవిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా బురిడీ బాబా అలియాస్ సుధాకర్ మహరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.. దాదాపు రెండు నెలలపాటు హాస్పిటల్ లో చికిత్స పొందిన సుధాకర్ బాబా ఇవాళ డిచార్జ్ అవ్వడంతో రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అతని వద్ద నుంచి 28 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.. వారు దొరికితేనే బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి.. మిగతా నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని రూరల్ డిఎస్పి రాఘవ రెడ్డి అన్నారు..

బైట్..
1. రాఘవ రెడ్డి..రూరల్ డిఎస్పి

SHARE