స‌చిన్ కుమార్తె సారాకు వేధింపులు

113

Thebullet news (Mumbai)_ మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారాను కిడ్నాప్‌ చేస్తానంటూ ఓ యువకుడు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు సమాచారం. నిందితుడ్ని పశ్చిమ్‌ బంగ మిద్నాపూర్‌కు చెందిన 32 సంవత్సరాల దేవ్‌ కుమార్‌ మిత్తిగా గుర్తించారు. అతను చదువు మధ్యలోనే ఆపేసి, ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం సచిన్‌ సహాయకులు ఒకరు ముంబయి పోలీసులను కలిసి అతనిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
గత నెల చివరి వారంలో సచిన్‌ ఇంటి ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి సారాను కిడ్నాప్‌ చేస్తానని, పెళ్లి చేసుకుంటానంటూ నిందితుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడు ఉండే ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్‌ చేశారు. ‘ఆమెను నేను చాలా సార్లు టెలివిజన్‌లో చూశాను. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా’ అని నిందితుడు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం సచిన్‌ కుమార్తె ముంబయిలో లేరు. ఆమె విదేశాల్లో చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

SHARE