పొదలకూరులో చిన్నారిపై కామాంధుడి పైశాచికం

209

The Bullet News ( Podalakuruu)_
అభంశుభం ఎరుగని ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై వరుసకు తాత అయ్యే ఓ వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఉదంతం పొదలకూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీలో శుక్రవారం రాత్రి వెలుగుచూసింది కాలనీలో ఉన్న చిన్నారిపై అదే కాలనీలో ఉంటున్న వరుసకు తాత అయ్యే కృష్ణయ్య అనే వృద్ధుడు గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.ఈ క్రమంలో చిన్నారి శుక్రవారం మర్మాంగం వద్ద నొప్పిగా ఉందంటూ తల్లికి చెప్పింది . ఈ మేరకు తల్లి చిన్నారిని ప్రైవేటు లేడీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది . ఆమె పరీక్షించి ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకిందని అందుకు అవసరమైన మందులు రాసిచ్చింది . చిన్నారి తల్లిదండ్రులు ఏమి జరిగిందంటూ పాపను ఆరాతీయగా కృష్ణయ్య అనే వ్యక్తి తనను ఇంటికి తీసుకెళ్లి బట్టలూడదీసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వివరించింది . దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు . పొదలకూరు పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు

SHARE