తెలుగోడి సత్తాని ఢిల్లీకి చాటి చెబుదాం.. – సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

48

THE BULLET NEWS (MUTHUKUR)-తెలుగోడి సత్తాను ఢిల్లీకి కనిపించేలా పోరాటాలు చేద్దామని సర్వేపల్లి టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఆయన ఆధ్వర్యంలో ముత్తుకూరు నుంచి బ్రహ్మదేవం జెన్ కో క్రాస్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం మొదటి నుంచి పోరాడుతున్నది టీడీపీనే అన్నారు.. ప్పుడు మళ్లీ మన హక్కుల సాధన కోసం ఢిల్లీ పెద్దలతో తీవ్రంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.. రాష్ట్రానికి హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుదామని అందులో యువత భాగస్వామ్యం అవ్వాలన్నారు..
రాష్ట్ర ప్రయోజనాల కోసమే అప్పట్లో బీజేపీతో బాబు పొత్తు పెట్టుకున్నారని.. నాలుగేళ్లు ఓపికగా ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వం నుంచి బయటికి వచ్చామన్నారు..కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి గాయం చేస్తే.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీజేపీ ఆ గాయంపై కారం చల్లుతోందని మండిపడ్డారు.. హోదా, రైల్వే జోన్ తో పాటు మిగిలిన హామీలన్నింటిని కేంద్రం పెద్దలు పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలు, హామీల కోసం పార్లమెంట్ లో మన ఎంపీలు తీవ్రంగా పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు.. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ లక్ష్యంగా పోరాటం సాగిస్తున్న మన సీఎం చంద్రబాబుకి, ఎంపీలకు తెలుగు ప్రజలందరం అండగా నిలుద్దామని.తెలుగు వారి సత్తా ఏంటో మరోసారి ఢిల్లీ పెద్దలకు చూపిద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు.

SHARE