చేతులూపితే స్కాల‌ర్ షిపులు రావ్ – విక్ర‌మ‌సింహ‌పురి యూనివ‌ర్శిటీ స‌భ‌లో సీఎం

102

The bullet news (Nellore)_  నూత‌న భ‌వనాల ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రారంభోత్స‌వం అనంత‌రం విద్యార్దుల‌తో కాసేపు ఇంట్రాక్ట్ అయ్యారు.. యూనిర్శిటీకి చెందిన విద్యార్దులు ఎవ్వ‌రూ స‌భ‌లో లేక‌పోవ‌డంతో డికేడ‌బ్య్లూకు చెందిన విద్యార్దులో సీఎంతో మాట్లాడారు.. విద్యార్దులు మ‌ట్లాడుతూ డిజిట‌ల్ క్లాసులు, బ‌యోమెట్రిక్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల విద్యార్దుల‌తో పాటు లెక్చ‌ర‌ర్స్ కు కూడా ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌న్నారు.. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ విద్యార్డుల‌కు ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల గురించి వివ‌రించ‌సాగారు.. ఈ క్ర‌మంలో స్కాల‌ర్ షిప్స్ అంద‌రికీ అంద‌జేస్తున్నామ‌ని మాట్లాడుతుండ‌గా విద్యార్దులంద‌రూ త‌మ‌కు స్కాలర్ షిపులు రావ‌డంలేద‌ని చేతులు పైకెత్తారు.. దీంతో స్పందించిన సీఎం చేతులు పైకెత్తితే స్కాల‌ర్ షిపులు రావ‌మ‌ని క్లాసుల‌కు వెళ్లి శ్ర‌ద్ద‌గా చ‌దువుకుంటే వ‌స్తాయ‌ని బ‌దులిచ్చారు..

స‌భా ప్రాంగ‌ణంలో క‌నిపించ‌ని యూనివ‌ర్శిటీ విద్యార్దులు..
మ‌రోప‌క్క స‌భా ప్రాంగ‌ణాల్లో యూనివ‌ర్శిటికి చెందిన విద్యార్దుల్లెవ్వ‌రూ హాజ‌రుకాలేదు.. గ‌త కొద్ది నెల‌లుగా వివాదాల‌కు నిల‌యంగా మారిన విశ్వ‌విద్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వ‌స్తుండ‌ట‌తో విద్యార్దుల‌ను ఎవ్వ‌రినీ మాట్లాడ‌నివ్వ‌కుండా, ప్రాంగ‌ణలోకి అనుమ‌తివ్వ‌కుండా చేశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి..

SHARE