`ఐ డోంట్ నో` అంటూ వచ్చేసాడు.

54

THE BULLET NEWS-సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా హ్యాట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న సినిమా `భ‌ర‌త్ అనే నేను`. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కైరా ఆడ్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ఇటీవ‌ల విడుద‌లై మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని రెండో పాట‌ను విడుద‌ల చేశారు.

`ఐ డోంట్ నో` అంటూ సాగే ఈ పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. బాలీవుడ్ హీరో, గాయ‌కుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఈ పాట‌ను పాడ‌డం విశేషం. ఈ రోజు (ఆదివారం) ఉద‌యం ప‌ది గంట‌ల‌కు విడుద‌లైన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్ప‌టికే ట్రెండింగ్ అయిపోయింది. త్వ‌ర‌లో మిగిలిన పాట‌ల‌ను కూడా చిత్రబృందం విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

SHARE