సెల్ఫీ విథ్ వివేకానంద…

49

THE BULLET NEWS – స్వామి వివేకానంద పేరు చెప్పగానే 125 ఏళ్ల క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం గుర్తుకు వస్తుంది. ముందస్తు సిద్ధం చేసిన ప్రసంగపాఠం లేకుండా…అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయిన ఘట్టం చిరస్మరణీయం. ఆంగ్లం ఆయన చేసిన ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పట్టింది. గొప్ప ఉపన్యాసకుడైన స్వామి వివేకానందను ఆకాలంలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు. చికాగోలో ఆయన తొలి ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతట ప్రతి ధ్వనిస్తోంది.

అది 1893, సెప్టెంబరు 11.. చికాగోలో సర్వమత సమ్మేళనం సాగుతోన్న రోజులు. ఈ మహాసభకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరందిరిలో కెల్లా భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద ఒక్కరే పిన్న వయస్కుడు. ఈ సమ్మేళనానికి హాజరైన వారంతా తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు. అయితే వివేకానందుడి దగ్గర అలాందేమి లేదు. అందుకే తన ప్రసంగాన్ని చివరలో ఉంచమని సభాధ్యక్షుడికి విఙ్ఞ‌ప్తి చేశారు.

వాస్తవానికి స్వామి వివేకానంద చికాగో నగరానికి జులైలోనే చేరుకొన్నారు. కానీ విశ్వమత సభలు సెప్టెంబరులో ప్రారంభమవుతాయని, అందులో పాల్గొనడానికి ధ్రువ ప్రత్రాలు తప్పనిసరని, అవి ఉన్నా వక్తలను అనుమతించే సమయం ఎప్పుడో దాటి పోయిందని తెలిసి చాలా మధనపడ్డారు. అక్కడ వాతావరణం కూడా ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. బోస్టన్ నగరంలో ఖర్చు తక్కువని ఎవరో చెప్పగా విని అక్కడకు రైలులో వెళ్లారు. బోస్టన్‌లోనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేహెచ్ రైట్స్‌తో వివేకానందుడికి పరిచయం ఏర్పడింది.
విశ్వమత సభల్లో పాల్గొడానికికు తనకు ఒక ధ్రువపత్రం కావాలని రైట్స్‌ను స్వామిజీ అడిగితె… మిమ్మల్ని ధ్రువపత్రం అడగడమంటే ‘సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే’ అని చెప్పి ‘ఈ వ్యక్తి మేధస్సు, పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితుల అందరిని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా చాలా గొప్పది’ అని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
దీంతో స్వామీజీకి సర్వమత సమ్మేళన సభలో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక సభల్లో ప్రసంగించే అవకాశం అందరి కంటే చివరన ఆయనకు దక్కింది. వివేకానందుడు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ‘అమెరికా సోదర సోదరీమణులారా’ అని సభికులను ఉద్దేశించి సంబోధించగానే దాదాపు మూడు నిమిషాల పాటు కరతాల ధ్వనులతో ప్రాంగణం దద్దరిల్లింది. వివేకానందుడి ప్రేమ పూర్వక పిలుపునకు సభికులు దాసోహం అన్నారు.

భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని, చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి సముద్రంలో చేరిన విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుడిని చేరుకోవడమేని అన్నారు. దీని కోసం ఎవరూ మతం మార్చుకోవాల్సిన అవసరంలేదని, తమ మతం మాత్రమే గొప్పదని భావించే వారు బావిలో కప్పలు లాంటి వారని వివేకానందుడు వ్యాఖ్యానించారు. ఆ అద్భుత ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో స్వామిజీ తన గొప్పదనమే కాదు, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారు. ఈ ప్రసంగం అనంతరం అయన ఫోటోతో పాటు ‘స్వామి వివేకానంద -ది సైక్లోనిక్ మాంక్ అఫ్ ఇండియా’ అని పోస్టర్స్ ముద్రించి చికాగో నగరంలో వేలాడదీశారు.


జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో విస్డమ్ స్టడీ సెంటర్ ఆద్వర్యంలో విధ్యార్థులంతా కలిసి ఈ దేశం మనది ఈ దేశం అంతా ఒకటి అనే భావన కలిగి ఉండాలి అని స్వామి వివేకానంద స్పూర్తి తో అందరిపట్ల సోదరభావంతో మెలగాలనే సంకల్పంతో దేశ భక్తి కలిగి ఉండాలి అని స్వామి వివేకానంద మాస్క్ లు మరియు టోపీలు ధరించి వరల్డ్ హిందూ కాంగ్రెస్ చికాగో మహసభలను‌ దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 5 నుండి సెల్ఫీ విథ్ వివేకానంద కార్యక్రమం ను రూపొందించి విధార్థుల లోకి వెళ్ళగా అనూహ్యమైన స్పందన విధ్యార్థుల‌నుండి వచ్చింది. విశ్వవిద్యాలయ విధ్యార్థులందరూ I am Vivekananda I for My Nation అనే నినాధం తో సెల్ఫీ లు దిగి‌ సోషల్ మీడియా లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయ ఉపకులపతి, రెక్టార్ , డైరెక్టర్ లు మరియు అధ్యాపకులు కూడా పాల్గొనడం జరిగింది. విశ్వవిద్యాలయం అంతటా దేశ భక్తి వాతావరణం లో భారత్ మాతా కీ జై‌, వివేకానంద కి జై లతో మార్మోగింది. సుమారు 1500 మంది విధ్యార్థులు 200 ల సెల్ఫీల పైన దిగి వివేకానందుని పై అభిమానాన్ని చాటుకున్నారు. చివరిగా సెప్టెంబర్ 11 న విశ్వవిద్యాలయం లో ఆడిటోరియం లో 200 మంది విధ్యార్థులతో సభ నిర్వహించడం జరిగింది ముఖ్య వక్తగా శ్రీ పూర్ణ ప్రభాకర్ గారి సింగరేణి కాలరీస్ పదవీ విరమణ ఉద్యోగి మాట్లాడుతూ దేశం లో యువత వివేకానంద ను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పనిచేయాలని, స్వాభిమానము తో జీవించాలని, వివేకానంద ఆశయసాదన కోసం పనిచేయాలని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమం లో అనేకమంది అధ్యాపకులు కూడా పాల్గొని‌ మార్గదర్శనము చేయడం జరిగింది. చివరిగా అందరూ కలిసి ఒక పెద్ద సెల్ఫీ దిగి దేశం లో యువత కు ఆదర్శంగా జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం విధ్యార్థులు ఆదర్శంగా నిలిచారు. దేశం లో సాంకేతిక విశ్వవిద్యాలయం అయినప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి దేశం లో ఉన్న అనేక విశ్వవిద్యాలయాలకు ఒక‌ కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చారు అనే చెప్పొచ్చు.

SHARE