టాలెంటెడ్ స్టూడెంట్స్ కి సేవాభారతి చేయూత

110

The Bullet News – Nellore

ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు సేవా భారతి అండగా నిలించింది.. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా టాలెంటెడ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసింది.. బివి నగర్ లోని కేఎన్ఆర్ స్కూల్, పొదలకురులోని జడ్పీ స్కూల్, వనంతోపు లోని భారతీయ విద్యా వికాస్ స్కూల్ లోని దాదాపు 17 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నగదు పురస్కారాలు అందజేసింది.. అలాగే అఖిల భారత స్థాయిలో 24వ ర్యాంక్ సాధించిన కౌసల్య కు రూ. 5000 నగదు అందించింది.. మొత్తం 60వేల నగదును అందజేశారు.. దాతలకు సేవా భారతి కృతజ్ఞతలు తెలియజేసింది.. ఈ కార్యక్రమంలో భక్తవత్సల నగర్ మిత్ర మండలి సభ్యులు రాజేష్, ఆటోమొబైల్ అసోసియేషన్ నాయకులు సుధాకర్ రెడ్డి, బిజిపి నాయకులు పాల్గొన్నారు..

SHARE