దుశ్శాసన చర్య.. అమ్మాయిపై లైంగిక వేధింపులు

77

THE BULLET NEWS (BHUBANESWAR)-దుశ్శాసన పర్వం లాగే.. కొంతమంది కీచకులు ఓ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశారు. అంతే కాదు సభ్యసమాజం తలదించుకునేలా.. ఆ పనికిమాలిన చర్యను వీడియో కూడా తీశారు. ఈ ఘటన ఒడిశాలోని బార్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. సుమారు 10 మంది యువకులకు పైగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని చుట్టుముట్టారు. ఆమెను కామెంట్ చేస్తూ.. వేధింపులకు గురిచేశారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక అమ్మాయి వెంట ఉన్న ఓ యువకుడిని ఆ దుండగులు కొట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. అమ్మాయిని వేధింపులకు గురి చేసిన ప్రధాన నిందితులైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

SHARE