భూములు పంచాలంటూ కొమర‌పూడి ద‌ళితుల ఆందోళ‌న‌

72

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని కొమ‌ర‌పూడి గ్రామ ద‌ళితులు, నిరుపేద‌లు ఆందోళ‌న‌కు దిగారు. గ్రామ ప‌రిధిలో స‌ర్వే నెంబ‌ర్ 1903- 2లో ఉన్న దాదాపు 350 ఎక‌రాల భూమిని, భూమిలేని నిరుపేద‌ల‌కు పంచాల‌ని డిమాండ్ చేశారు.
అంబేద్క‌ర్ ద‌ళిత భూమి సంర‌క్ష‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో
ఆందోళన నిర్వహించారు..
ఈ సంద‌ర్భంగా ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ కులాల అంబేద్క‌ర్ ద‌ళిత భూమి సంర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షులు ఎస్‌. సుధాక‌ర్‌, ఉపాధ్య‌క్షులు కె.మ‌నోహ‌ర్‌లు మాట్లాడుతూ కొమ‌ర‌పూడి గ్రామంలో దాదాపు 350 కుటుంబాల పేద‌లు కూలి చేసుకుని జీవ‌నం సాగిస్తున్నారు.. కూలి పనులు కూడా లేక పూట కూడా గడవని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
ఈ నేప‌థ్యంలో కొమర‌పూడి గ్రామ ప‌రిధిలో స‌ర్వే నెంబ‌ర్ 1903- 2లో ఉన్న దాదాపు 340 ఎక‌రాల కొండ‌దిబ్బ శివాయి భూమిని ఆ గ్రామస్తులకు పంచి వలసలను నివారించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విష‌యంపై తాము జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌ల‌సి విన‌తిప‌త్రం కూడా అందించామ‌ని, అందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు. ఇదే సమయంలో ఈ భూమిపై కన్నేసిన అగ్ర‌వ‌ర్ణాల నాయకులు ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.. ఈ విష‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్, పాల‌కులు, ప్ర‌జాప్రతినిధులు జోక్యం చేసుకుని శివాయి భూమిగా ఉన్న కొండ‌దిబ్బ‌ను కొమ‌ర‌పూడి గ్రామంలో భూమి లేని పేద‌ల‌కు పంచాల‌ని వారు డిమాండ్ చేశారు.. కొండ‌దిబ్బ‌లో ఉన్న గ్రావెల్‌ను తవ్వుకునేందుకు కె. వేణుగోపాల్ రెడ్డి, మాల్యాద్రిలు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు తెచ్చుకుంటే, వారిని కూడా గ్రామంలోని అగ్ర‌కులాల వాళ్లు బెదిరిస్తున్నార‌ని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలోఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ కులాల అంబేద్క‌ర్ ద‌ళిత భూమి సంర‌క్ష‌ణ స‌మితి స‌భ్యులు, నాయ‌కులు, దాదాపు 350 కుటుంబాల ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

SHARE