అది తల్లి కాదు.. నల్లి .. తల్లి అన్న పదానికే తలవంపులు తెచ్చిన నీచురాలు ..

192

THE BULLET NEWS (NAIDUPETA)-   నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మాతృత్వానికే మచ్చతెచ్చిన సంఘటన .. నాయుడుపేట మునిరత్నం నగర్ లో దారుణం చోటుచేసుకుంది.

కన్న బిడ్డ చిన్న తప్పు చేశాడని రెండు చేతులకు దారుణం వాతలు పెట్టేసింది ఓ తల్లి.. మూత్రం పోసిన గుడ్డని పక్కింట్లోకి విసిరేసిందన్న కోపంతో ఆరేళ్ళ చిన్నారిపై తల్లి ఈ ఘాతుకానికి పాల్పడింది. గాస్ స్టవ్ పై అట్ల కాడ ఉంచి దానితో వాతలు పెట్టింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న బాలుడిని చూసిన స్థానిక అంగన్ వాడి వర్కర్లు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. పిల్లలపై ఇలాంటి కఠిన శిక్షలు వేయకూడదని, ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి కసాయి ల వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరికి కంట తడి పెట్టించింది.అయినా ఆ ఉన్మాద తల్లి ఇప్పటికీ తాను చేసింది తప్పు అని బావించడంలేదు .. చేతులను ఇంత దారుణంగా కాల్చి , ఇంత పెద్ద గాయం అవుతుందని తానూ అనుకోలేదని అన్నారు

SHARE