పెళ్లిపీటలెక్కనున్న శ్రుతి హాసన్‌?

126

The bullet news (Cinema)_   ప్రముఖ నటి శ్రుతి హాసన్‌.. లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలాసార్లు శ్రుతి.. మైఖేల్‌ను ముంబయికి కూడా తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు శ్రుతి ఆయనను తన తల్లి సారికకు పరిచయం చేశారట. మైఖేల్‌, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో శ్రుతి పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శ్రుతి తన ప్రేమ గురించి ఎప్పుడూ మీడియా ముందు నేరుగా చెప్పలేదు. కానీ, తన వ్యక్తిగత విషయాలను అందరితో చెప్పుకోవడం తనకు నచ్చదని చెపుతూనే, పరోక్షంగా ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మైఖేల్‌ని తన తల్లికి పరిచయం చేశారు కాబట్టి, త్వరలోనే శ్రుతి పెళ్లికబురు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రుతిహాసన్‌ ‘శభాష్‌ నాయుడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ పతాకంపై కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి.కె. రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

SHARE