సింహ‌పురి యూనివ‌ర్శిటీ బెస్ట్ యూనివ‌ర్శిటీగా అభివృద్ది చేస్తా- సీఎం చంద్ర‌బాబు నాయుడు

61

The bullet news (Nellore)- తెలివితేట‌ల్లో నెల్లూరు విద్యార్దుల‌కు కొద‌వ‌లేదు..కొత్త విషయాల మీద దృష్టి పెట్టండి. అవి సమాజానికి ఉపయోగపడేలా చూడండి.. ప్రతి విద్యార్థి ఒక పరిశోధకుడు కావాలి, అందుకే విద్యార్థులను క్షేత్ర స్థాయి లో పరిశోధనలకు అవకాశం ఇస్తున్నామంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విద్యార్దుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. అంత‌కుముందు హెలికాప్ట‌ర్ ద్వారా కాకుటూరు చేరుకున్న ముఖ్య‌మంత్రికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. అనంత‌రం విక్రమ సింహపురి వర్సిటీ భవనాలను ప్రారంభించిన సీఎం విద్యార్దుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.. విద్యార్దుల‌తో ఇంట్రాక్ట్ అయ్యారు. ఏపీలోనే విక్రమ సింహపురి వర్సిటీని బెస్ట్ వర్సిటీగా తీర్చిదిద్దుతాన‌ని సీఎం హామీ ఇచ్చారు.. యూనివ‌ర్శిటీ అభివృద్దికి 50 కోట్ల నిధులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఎక్స్ పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి వర్సిటీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాన‌న్నారు. మొదటి సారిగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాలజీకి, కళాశాలలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు..ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి కృషి చేస్తున్నాన‌న్నారు.. అందులో భాగంగానే కళాశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్ లు, వై ఫై ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు..

SHARE