సింహపురి యూత్ అసోసియేషన్ సేవలు అభినందనీయం – వెంకటగిరి ఎమ్మెల్యే, చైర్ పర్సన్ లు కితాబు..

180

The bullet news (Venkatagiri)- ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. అభాగ్యులకు అండగా నిలవడం.. విద్యార్దులకు చేయూతనివ్వడం వంటి సేవాకార్యక్రమాల్లో సింహపురి యూత్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకిష్ణ అన్నారు.. ఇవాళ వెంకటగిరి పట్టణంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్దినీలకు కువైట్ లోని అమ్మ హెల్పింగ్ హేండ్స్ వారి ఆర్దిక సహాయంతో సింహపురి యూత్ అసోసియేషన్ పరీక్షా సమాగ్రీని అందజేసింది.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకిష్ణ, చైర్ పర్సన్ దొంతు శారదా, ఎఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, న్యాయవాది కోటేశ్వరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కేవీకే ప్రసాద్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సింహపురి యూత్ అసోసియేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.. అనంతరం సింహపురి యూత్ అసోసియెషన్ సబ్యులు మాట్లడుతూ దాతలు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసేందుకు తామెప్పుడూ ముందుంటామన్నారు.. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఉజ్వల సేవా సమితి రాము కి ప్రత్యక ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సింహపురి యూత్ అసోసియేషన్ సభ్యులు పోచినేని ప్రవీణ్ కుమార్, వెంకటేష్, రాము, బాలు, దీక్షిత్, మదన్, వంశీ, పురుషోత్తం, మోహన్, మునిరాజ, సాయి చరణ్, నితిన్, గుణప్రకాశ్ పాల్గొన్నారు..

SHARE