చిన్నారి శృతి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

136

The bullet news (Sarvepalli)_ ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చారు.. మంత్రి సోమిరెడ్డి ఆపన్న హస్తం అందించారు.. గ్రామస్తుల.. వైద్యులు తోచిన సాయం చేశారు.. కానీ ఆ చిన్నారి విషయంలో దేవుడు చిన్నచూపు చూశాడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడికి చెందిన చిన్నారి రేష్మశృతి (9) మృతిచెందింది.. ఆ చిన్నారి మృతదేహాన్ని ఇవాళ స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంద‌ర్శించి నివాళ్ల‌ర్పించారు.. కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.. ఆపరేష‌న్ కు దాదాపు రూ.25ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు చెప్ప‌డంతో బాధితులు సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని ఆశ్ర‌యించారు.. రాజ‌గోపాల్ రెడ్డి మంత్రి సోమిరెడ్డి తో మాట్లాడి మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే రూ.8ల‌క్ష‌ల మంజూరు చేయించారు.. మరో రూ.12 లక్షలను టాటా ట్రస్టు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇంకో రూ.5 లక్షలను వైద్యులు, గ్రామస్తులు కొందరు సమకూర్చారు. బోన్ మార్పిడికి వైద్యులు సిద్ద‌మ‌వుతున్న త‌రుణంలో ఇన్ పెక్ష‌న్ సోక‌డంతో శృతి మృతిచెందింది.. కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి సోమిరెడ్డి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు..

SHARE