మంత్రి సోమిరెడ్డికి అసలు పరువుందా..? ‍

227

THE BULLET NEWS (NELLORE)-వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరోసారి తనదైన శైలిలో హాట్ హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి సోమిరెడ్డి తనపై వేసిన పరువు నష్టం దావాపై ఘాటుగా స్పందించారు.. మంత్రి సోమిరెడ్డికి పరువుందో లేదో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు బాగా తెలుసన్నారు..పరువు లేని మంత్రి పరువు కోసం పాకులాడటం హాస్యాస్పదమన్నారు.. పరువు నష్టం దావావేసిన మంత్రి కి అసలు పరువుందా అని ప్రశ్నించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధించిన ఇయర్లీ టార్గెట్స్ లో భాగంగానే నాపై తప్పుడు కేసులు, పరువు నష్టం దావాలు వేస్తున్నారన్నారు. సోమిరెడ్డి ముమ్మూటికీ అవినీతిపరుడేనన్నారు.. సోమిరెడ్డి క్యారెక్టర్ లెస్ ఫెలో అని ఆయన మండిపడ్డారు.. సోమిరెడ్డి అవినీతిపై ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.. ఉన్న పించన్లను ఊడగొట్టడానికే ఐదో విడత జన్మభూమి కార్యక్రమమన్నారు..

SHARE