పెద్ద చదువుల్లో కొడుకు, కూతురు.. ఆమె చేస్తున్న పని ఏంటో తెలిస్తే..

141

the bullet news(hyderabad)-

 ఆమె సాధాసీదా దొంగ కాదు. నగరంలో అడుగుపెడితే నగలు మాయం. కొడుకు, కూతురు పెద్ద చదువులు చదువుతున్నారు. తల్లి దొంగతనం చేస్తుందనే విషయం వారికి తెలియదు. హైదరాబాద్‌లో ఇంట్లో పనిమనిషిగా చేరి నగలు అపహరిస్తున్న మాయ లేడీని కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ. 25లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి, మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు అన్నానగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ భార్య శాంతి(41) అలియాస్‌ లక్ష్మి, పార్వతి, జ్యోతి, సుమిత్రల పేర్లతో ప్రతినెలా మొదటి వారం రైలులో హైదరాబాద్‌ వస్తోంది. ఇళ్లలో పనిమనిషిగా చేరి అదును చూసి నగలు అపహరిస్తోంది.
2006లో మారేడ్‌పల్లిలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరి నగలు అపహరించింది. అనాథనని చెప్పి పనిలో చేరుతోంది. తరువాత చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ తమిళం మాట్లాడే వ్యక్తుల కోసం వెతికేది. నవంబర్‌ 26న నరేష్‌ అనే వ్యక్తి ఇంట్లో రెండు రోజులపాటు పనిమనిషిగా 50 గ్రాముల బంగారు మంగళసూత్రం అపహరించింది. బాధితుడు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. శాంతిపై ఇప్పటి వరు 14 కేసులున్నాయని దర్యాప్తులో తేలింది. ఈ నెల 4న మెహిదీపట్నం బస్టాప్‌ వద్ద ఆమె ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు పట్టుకున్నారు.

 

SHARE