నెల్లూరులో బ్రమరాంభకు బ్రహ్మరథం…

82

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు లో స్పైడర్ భామ సందడి చేసింది.. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్
ప్రారంభోత్సవానికి వచ్చిన రకుల్ కు నెల్లూరు యువత బ్రహ్మరథం పట్టారు.. భ్రమరాంబను చూసేందుకు
ఎగబడ్డారు.. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ 17వ షోరూమ్ ను ఆ
అందాలభామ ప్రారంభించారు.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం షాపింగ్ మాల్ మొత్తం తిరిగారు.. వచ్చి రాని
తెలుగులో అభిమానులను పలకరించింది.. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ సంప్రదాయ పద్దతులతో
పాటు మారుతున్న మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సరికొత్త వస్త్రాభారణాలను అందించడంలో సౌత్
ఇండియన్ షాపింగ్ మొదటి వరసలో ఉంటుందన్నారు.. సౌత్ ఇండియాన్ షాపింగ్ మాల్ ను ఆదరిస్తున్న
వారందరికీ ఆమె క్రుతజ్ణతలు తెలిపింది.. మరోపక్క హీరోయిన్ ను చూసేందుకు యూత్ ఎగబడటంతో
కొంతమేర ట్రాఫిక్ స్థంభించింది..

SHARE