ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూ.. లైవ్ లో ఆత్మహత్య

121

THE BULLET NEWS(CRIME)-హైదరాబాద్ నగర శివారులో కొంపల్లి లో శివ శివానీ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకొన్నది. అనంతరపురం జిల్లాకు చెందిన హనీషా అనే యువతి ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కాలేజీ హాస్టల్ లో ఉంటుంది. తన ప్రియుడు దక్షిష్ పటేల్ తో వీడియో కాల్ మాట్లాడుతూ… అతను చూస్తుండగానే ఫ్యాన్ కు ఉరివేసుకొన్నది. అతను వెంటనే స్పందించి హాస్టల్ గదికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి తెరిచాడు.. అక్కడ ఉన్న ఫ్రెండ్ సాయంతో హనీషాను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు.. కానీ అప్పటికే హనీషా మృతి చెందింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

SHARE