చ‌దువులే కాదు.. క్రీడ‌లు కూడా ముఖ్య‌మే – శ్రీచైత‌న్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు

79

The bullet news (Gudur)- ప్రతి ఒక్క‌రి దిన‌చ‌ర్య‌లో క్రీడ‌లు భాగమ‌వ్వాల‌ని శ్రీచైత‌న్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు.. జాతీయ క్రీడాదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గూడూరులోని శ్రీచైత‌న్య టెక్నో స్కూల్ లో ఉపాధ్యాయుల‌కు, విద్యార్దుల‌కు క్రీడా పోటీలు నిర్వ‌హించారు.. ఈ పోటీల‌ను ఏజీఎం శ్రీకాంత్, డీన్ ర‌బ్బానిల‌తో కలిసి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును క్రీడా దినోత్స‌వంంగా జ‌రుపుకోవ‌డం మ‌న‌కు ఆయ‌కిచ్చే గౌర‌వ‌మ‌న్నారు. చిన్న‌త‌నం నుంచే విద్యార్దులు క్రీడ‌ల ప‌ట్ల మ‌క్కువ క‌ల్గి ఉండాల‌న్నారు.. ఏదో ఒక క్రీడ‌పై ఆస‌క్తి క‌న‌బ‌రిచి ఉత్తమ ప్ర‌తిభ క‌న‌చ‌రిచేందుకు కృషి చేయాల‌న్నారు.. చ‌దువుతో పాటు క్రీడ‌ల‌కు కూడా త‌మ స్కూల్ ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు.. ఈ క్రీడాపోటీల్లో గెలుపొందిన‌ విద్యార్దుల‌కు ఆయ‌న బ‌హుమ‌తులు అంద‌జేశారు..

SHARE