నెల్లూరులో సంద‌డి చేసిన స్పైడ‌ర్ భామ‌..

159

The bullet news (Nellore)-స్పైడర్ భామ రకుల్ ప్రీతిసింగ్ సింహపురిలో సందడి చేసింది.. బిగ్ సీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నఆమె బిగ్ సీ ద‌స‌రా ల‌క్కి డ్రిప్ ద్వారా విజేతల‌ను ఎంపిక చేసేందకు నెల్లూరొచ్చారు.. న‌గ‌రంలోని న‌ర్తకి సెంట‌ర్ లో ఉన్న బిగ్ సీ బ్రాంచ్ లో ఆమె ల‌క్కి డ్రిప్ ద్వారా 10 మంది విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు.. ఈ సంద‌ర్భంగా వ‌చ్చీరాని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడి నెల్లూరు యువ‌త‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసింది.. అతిగా తినకపోవడం.. కొవ్వు పదార్దాల జోలికి వెళ్లకపోవడమే తన గ్లామర్ సీక్రెట్ అని చెప్పుకొచ్చారు.. ఏ హీరో నీకిష్టమంటూ కొందరు ప్రశ్నంచగా టాలివుడ్ లో ఉండే హీరోలందరూ తనకిష్టేమేనన్నారు.. నెల్లూరు చేపలపులుసంటే తనకెంతో ఇష్టమని రకుల్ అన్నారు.. మరోపక్క రకుల్ ను చూసేందుకు యువత బిగ్ సి షోరూమ్ ఉండే నర్తకి సెంటర్ కు భారీగా తరలివచ్చారు..

SHARE