పబ్లిక్ గా బట్టలు విప్పి నిరసన చేసిన శ్రీ రెడ్డి

375

THE BULLET NEWS (HYDERABAD)-తమ సమస్యలపై సిఎం కేసిఆర్ స్పందించాలంటూ ఆమె గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఒకవేళ సిఎం కేసిఆర్ స్పందించకపోతే తాను నడి రోడ్డు మీద నగ్నంగా నిరసన తెలుపుతానని ఆమె ప్రకటించి సంచలనం రేపింది.

అయితే ముందుగా ప్రకటించినట్లుగానే శ్రీరెడ్డి శనివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ముందు నగ్నంగా కాదు కానీ అర్ధ నగ్నంగా కూర్చుని నిరసన తెలిపింది. సగానికి పైగా తన వస్త్రాలను విప్పేసి రోడ్డు మీద కింద కూర్చుని ఆందోళనకు దిగింది.

శ్రీరెడ్డి నిరసన తెలపడంతో వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆమెపై న్యూసెన్స్ చేసిన నేరం కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఉన్న కంపు కమారాన్ని మొత్తాన్ని బయటకు తీస్తున్నారు. సినిమా రంగంలో ఎవరెవరు ఎలాంటి వారో వెల్లడిస్తూ సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. తనకు తనలాంటి వాళ్లకు అన్యాయం చేసిన సినీ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. పలు టివి చానెళ్లకు కూడా ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతిమంగా నగ్న నిరసన తెలిపి సినీ ఇండస్ట్రీలో ఉన్న మాలిన్యాన్ని బయటి ప్రపంచానికి చాటి చెప్పారు.

మరి నగ్న నిరసన తర్వాత శ్రీరెడ్డి తదుపరి కార్యాచరణ ఏరకంగా ఉంటుందో అన్నది తేలాలి.

SHARE