నెల్లూరు జిల్లాలొో శ్రీమంత ఎమ్మెల్యే

50

The bullet news (Political)- వ్యక్తిగత ఆదాయంలో ఆలిండియాలో దక్షిణాది ఎమ్మెల్యేలే శ్రీమంతులు! దేశం మొత్తమ్మీద తొలి స్థానంలో కర్ణాటక ఎమ్మెల్యేలుంటే.. రెండో స్థానంలో మహరాష్ట్ర ఎమ్మెల్యేలున్నారు. ఈమేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌)… దేశవ్యాప్తంగా 3,145 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఆ వివరాలను వెల్లడించింది. దేశం మొత్తమ్మీద ఎమ్మెల్యేల సగటు ఆదాయం రూ.24.59 లక్షల (ఉమ్మడిగా రూ.773.48 కోట్లు) మేర ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. దక్షిణాదికి చెందిన 711 మంది సభ్యుల సగటు వార్షికాదాయం రూ.51.99 లక్షలు. ఈశాన్యంలోని 614 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం కేవలం రూ.8.53 లక్షలు. ఆలిండియా టాప్‌ 20లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. ఓవరాల్‌గా ఐదో స్థానంలో వైఎస్‌ జగన్‌, ఎనిమిదో స్థానంలో మర్రి జనార్దన్‌ ఉన్నారు. దేశం మొత్తమ్మీద అత్యల్ప ఆదాయం ఉన్న ఎమ్మెల్యే కూడా ఏపీకి చెందినవారే. శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల. ఈమె వార్షకాదాయం రూ.1301.

  • 711 మంది దక్షిణాది ఎమ్మెల్యేల సగటు వార్షిక ఆదాయం రూ.51.99 లక్షలు
  • టాప్‌ ప్లేస్‌లో ఉన్న కర్ణాటకలోని 204 మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.1.11 కోట్లు.
  • రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర ఎమ్మెల్యేల సగటు వార్షిక ఆదాయం రూ.43.4 లక్షలు.
  • 614 మంది ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేల సగటు వార్షికాదాయం కేవలం రూ.8.53 లక్షలు
  • 63 మంది ఛత్తీస్‌గడ్‌ ఎమ్మెల్యేల వార్షికాదాయం అత్యల్పంగా రూ.5.4 లక్షలు మాత్రమే
  • మొత్తం ఎమ్మెల్యేల్లో 8% మాత్రమే మహిళలు. పురుష ఎమ్మెల్యేల సగటు వార్షికాదాయం రూ.25.85 లక్షలుకాగా, మహిళలది రూ.10.53 లక్షలే!
  • దేశం మొత్తమ్మీద ఎమ్మెల్యేల్లో 25 శాతం మంది వ్యాపారులమని, మరో 24 శాతం మంది రైతులమని పేర్కొన్నారు.
  • వ్యవసాయం, వ్యాపారాన్ని వృత్తిగా ప్రకటించిన 13 శాతం మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం అందరికంటే ఎక్కువ (రూ.57.81
  • ఎమ్మెల్యేల్లో 25-50 ఏళ్ల మధ్య 1,402 మంది.. 51-80 లోపు 1,727 మంది, 82-90 మధ్య 11 మంది, ఆపై వయసువారు ఇద్దరు ఉన్నారు.
  • ఏపీలోని 139 ఎమ్మెల్యేల వార్షిక వ్యక్తిగత ఉమ్మడి ఆదాయం రూ.53.61 కోట్లు. సగటు ఆదాయం రూ.38.56 లక్షలు.
  • తెలంగాణలోని 94 మంది ఎమ్మెల్యేల ఉమ్మడి వ్యక్తిగత ఆదాయం రూ.26.27 కోట్లు. సగటు ఆదాయం రూ.27.94 లక్షలు
SHARE