స్టార్ ఆగ్రోకి మేయ‌ర్ కి సంబంధం లేదు..- టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది నన్నేసాహేబ్

110

The bullet news (Nellore)-  నెల్లూరు న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ పై ప్ర‌ముఖ సంస్థ జెంపెక్స్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను మేయ‌ర్ వ‌ర్గీయులు తిప్పికొట్టారు.. అబ్దుల్ అజీజ్ రాజకీయ ఎదుగుదలను సహించలేని వ్యక్తులు కుట్రపూరిత మనస్తత్వంతో ఆయన వ్యక్తిత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి, ప్రముఖ సీనియర్ న్యాయవాది నన్నేసాహేబు పేర్కొన్నారు. స్టార్ ఆగ్రో కంపెనీ యాజమాన్య బాధ్యతల నుంచి మేయ‌ర్ 2016లోనే త‌ప్పుకున్నాని ఆయ‌న వివ‌రించారు. చెన్నై కోర్టు కేసు ఆరోపణల పత్రాల్లో ఎక్కడా మేయరును ప్రతివాదిగా చేర్చలేదనీ, ఒక వ్యక్తిపై కేసు రిజిస్టర్ అయినంత మాత్రాన దోషి అని భావించడం తప్పనీ, విచారణలో అన్ని నిజాలు బహిర్గతమవుతాయన్నారు. సిబిఐ, ఈడి దాడులు చేసేంత స్థాయి వ్యవహారాలను మేయరు జరపడం లేదనీ, ఆర్ధికంగా దెబ్బతీసేందుకు సంబంధం లేని విషయాల్లో కుట్రపూరితంగా కావాలని ఇరికించారని నన్నేసాహేబ్ తెలిపారు. మేయరు ప్రతిష్టకు నష్టం చేకూర్చేలా జరుగుతున్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చి ఆయా వ్యక్తులపై పరువునష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మైనార్టీ నాయకులు షంషుద్దీన్, మౌలానాలు పాల్గొన్నారు.

SHARE