అమ్మకానికి పెడితే… దోచేస్తాం…

86

THE BULLET NEWS (SINGAPUR)-కొనుగోలుదారులుగా నటించిన ఇద్దరు దొంగలు యజమాని కళ్లు గప్పి రూ. 14.3 లక్షల విలువైన వాచ్‌ను ఎత్తుకెళ్లిన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. టాంగ్‌ అనే వ్యక్తి తన రోలెక్స్‌ వాచ్‌ను కార్వోసేల్‌ అనే ఆన్‌లైన్‌ సెల్లింగ్‌ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు.మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు.దాని విలువ రూ. 14.3 లక్షలు(29,500 డాలర్లు)గా పేర్కొన్నారు. అమ్మకానికి పెట్టిన వాచ్‌ను చూసిన వెన్‌పింగ్‌, జోష్వా అనే ఇద్దరు దొంగలు దాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అచ్చూ ఆ వాచ్‌లానే కనిపించే నకిలీ రోలెక్స్‌ వాచ్‌ను కొనుగోలు చేశారు. వాచ్‌ను కొనుగోలు చేస్తామని యజమానిని సంప్రదించారు. టాంగ్‌ చెప్పిన అడ్రస్‌కు వెళ్లిన నిందితులు వాచ్‌ను చూపించమన్నారు.టాంగ్‌కు అనుమానం రాకుండా ఒరిజినల్‌ వాచ్‌ స్థానంలో నకిలీ వాచ్‌ను ఉంచి అక్కడి నుంచి ఉడాయించారు. దీన్ని ఆలస్యంగా గ్రహించిన టాంగ్‌ మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించాడు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

SHARE