THE BULLET NEWS (KOVUR)- నెల్లూరు జిల్లా కోవూరు మండలం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎద్దుల స్వైర పోటీలు జరిగాయి.సంక్రాంతి సందర్భంగా కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు గత ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు .ఈ పోటీల్లో కృష్ణా జిల్లా,గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా , నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి ముప్పై జతల ఎద్దులు పాల్గొన్నయి .ఈ పోటీలు వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు .ఈ పోటీల వల్ల రైతులు తమ ఎద్దులు జాతి అంతరించిపోకుండా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

SHARE