THE BULLET NEWS (VAKADU)-నెల్లూరుజిల్లా వాకాడు మండల తీరప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. తూపిలిపాలెం బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన రెండు కుటుంబాలకు చెందిన రమ్య, రోహిణి అనే ఇద్దరు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్దులు మృత్యువాతపడ్డారు.. కోట మండలం వీరారెడ్డిపల్లికి చెందిన రెండు కుటుంబాలు ఇవాళ ఉదయం సముద్ర స్నానానికి వెళ్లాయి.. వీరితో పాటు గురుకులంలో చదువుతున్న రోహిణి, రమ్య కూడా వెళ్లారు.. అందరూ సూర్యోదయాన సముద్రంలో స్నానమాచరిస్తుండగా రమ్య, రోహిణి నీట మునిగిపోయారు.. వెంటనే బాధితులు స్థానిక మత్స్యకారులను వేడుకోగా గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలించారు. అప్పటికే ఆ ఇద్దరు సముద్రంలో నిర్జీవులయ్యారు. .వారిని గజఈతగాళ్లు వెలికితీశారు.. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.. రమ్య తండ్రి ఈ తెల్లవారుజామున అయ్యప్పస్వామి మాలధారణలో దర్శనానికి వెళ్లారు.. అనంతరం వీరు సముద్ర స్నానానికివెళ్లగా విషాద ఘటన చోటు చేసుకుంది.. బాలికల మృత‌దేహాలను వీరారెడ్డిపాలానికి తరలిస్తున్నారు..

SHARE